- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సుప్రీం తీర్పుపై రివ్యూ పిటిషన్..
– గిరిజనులకు వంద శాతం రిజర్వేషన్లు ఉండాల్సిందే: మంత్రి సత్యవతి
దిశ, న్యూస్ బ్యూరో: షెడ్యూల్ ఏరియాల్లోని గిరిజనులకు టీచర్ పోస్టులలో వంద శాతం రిజర్వేషన్లు కల్పించే రాష్ట్ర ప్రభుత్వ జీవో ఎంఎస్ నెం.3ని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కొట్టివేయడంపై సమగ్ర రివ్యూ పిటిషన్ వేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. సీఎం కేసిఆర్ నిర్ణయం మేరకు కసరత్తు జరుగుతోందనీ, త్వరలోనే పిటిషన్ వేయనున్నామని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో వంద శాతం రిజర్వేషన్లను వారికే కల్పిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో రాజ్యాంగ విరుద్ధమంటూ చేబ్రోలు లీలా ప్రసాద్ వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం దురదృష్టకరమని అన్నారు. ఈ తీర్పుపై ఆ శాఖ కమిషనర్, ప్రత్యేక కార్యదర్శితో శుక్రవారం దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్‌లో మంత్రి సమీక్ష జరిపారు. గిరిజనుల హక్కులను కాపాడే ఉద్దేశంతోనే రివ్యూ పిటిషన్ వేయాలనుకుంటున్నట్లు మంత్రి సత్యవతి రాథోడ్ ఒక
ప్రకటనలో తెలిపారు.
ఏపీ ప్రభుత్వాన్నీ సంప్రదిస్తున్నాం..
నిజానికి గిరిజన ప్రాంతాలు ఆర్థికంగా, సామాజికంగా, అభివృద్ధిపరంగా ఇంకా వెనకబడే ఉన్నాయనీ, అక్కడి గిరిజనుల హక్కులను కాపాడడంలో కేంద్ర ప్రభుత్వం కూడా సంపూర్ణ సహకారం ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని కేంద్ర గిరిజనశాఖ మంత్రి అర్జున్ ముండా దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. గిరిజనుల హక్కుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం రాజీపడబోదనీ, వారి హక్కులు, ప్రయోజనాలను కాపాడేందుకు సీఎం కేసీఆర్ కట్టుబడి ఉన్నారని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో గిరిజనులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు. షెడ్యూల్డు ఏరియాల్లో ఉపాధ్యాయ పోస్టుల్లో వంద శాతం రిజర్వేషన్‌ను గిరిజనులకు కల్పించాలని ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో నిర్ణయం జరిగి జీవో వచ్చినందున ఇప్పుడు సుప్రీంకోర్టు రివ్యూ పిటిషన్ వేసే విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా సంప్రదిస్తున్నామని తెలిపారు.
నిపుణుల సలహాలు తీసుకుంటాం..
రివ్యూ పిటిషన్ వేయడానికి సంబంధించి న్యాయ నిపుణుల సలహాలను కూడా తీసుకుంటున్నట్లు మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. వివిధ పార్టీల ప్రజా ప్రతినిధులు, గిరిజన సంఘాల ప్రతినిధులు, గిరిజన విద్యాధికులు తదితరులతో కూడా సంప్రదింపులు జరుపుతున్నామనీ, వారి అభిప్రాయాలను కూడా సేకరిస్తున్నామని తెలిపారు. గిరిజనుల సమగ్ర అభివృద్ధి కోసం తెలంగాణ కట్టుబడి ఉన్నందువల్లనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. వారి ప్రయోజనాలను కాపాడుతామని హామీ ఇచ్చారు. షెడ్యూల్డు ఏరియాల్లో ఉద్యోగాల భర్తీలో వంద శాతం రిజర్వేషన్‌ను గిరిజనులకే కల్పిస్తూ ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమనీ, ఇందిరా సాహ్ని కేసులో మొత్తం రిజర్వేషన్లు యాభై శాతం దాటవద్దని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం గత వారం గుర్తుచేసి జీవోను కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి రివ్యూ పిటిషన్ వేయనున్నట్లు చెప్పడం గమనార్హం.
Tags: Telangana, Tribal Reservations, Scheduled Areas, Supreme Court Judgement, GO No. 3, Minister Review, Petition