- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అడిగిన వెంటనే అభయమిచ్చిన మంత్రి సత్యవతి..
దిశ, వాజేడు : ములుగు జిల్లా ఐటీడీఏ ముప్పు, లోతట్టు గ్రామాల్లో తీసుకోవాల్సిన చర్యలపై ఐటీడీఏ పీఓ హన్మంతు కె జెండగే అధ్యక్షతన సమీక్ష సమావేశం ఏర్పాటు చేయగా జిల్లా పరిషత్తు చైర్‌పర్సన్ కుసుమ జగదీష్‌తో కలిసి రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ హాజరయ్యారు. ఇంటిగ్రేటెడ్ యాక్షన్ ప్లాన్ ద్వారా ఏటూరునాగారం మండల కేంద్రంలో అన్ని రోడ్లు, డ్రైనేజీ, సమీకృత ప్రణాళికలతో శాశ్వత అభివృద్ధి పరిష్కారం కోసం రూ.50 కోట్లు మంజూరు చేయాలని కుసుమ జగదీష్ మంత్రిని కోరారు. తక్షణమే స్పందించిన మంత్రి రూ.50 కోట్ల మంజూరుకు సానుకూలంగా స్పందించారు.
అభివృద్ధికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఐటీడీఏ ఏఈ హేమలతను ఆదేశించారు. సమీక్షా సమావేశంలో కలెక్టర్ శ్రీకృష్ణ ఆదిత్య, అదనపు కలెక్టర్ ఆదర్శ సురభి,జిల్లా రైతు బంధు అధ్యక్షులు పల్లా బుచ్చయ్య, జిల్లా కోప్షన్ నెంబర్ వాలియాబీ సలీమ్, పోరిక గోవింద్ నాయక్, ఆత్మ చైర్మన్ ఏటూరు నాగారం దుర్గం రమణయ్య, ఎంపీపీ అంతటి విజయ, పార్టీ మండల అధ్యక్షులు గడదాసు సునీల్ కుమార్, తుమ్మ మల్ల రెడ్డి, తాహిర్ పాషా, కృష్ణ రెడ్డి, పీఏసీయస్ చైర్మన్ కునూరు అశోక్ గౌడ్, రామన్న గూడం సర్పంచ్ దొడ్డ కృష్ణ, ఎంపీటీసీ అల్లి సునీత శ్రీనివాస్, తెరాస పాకునూరు మహేష్, కుమ్మరి చంద్రబాబు, సప్పిడి రామ నర్సయ్య, కోమిరె రమేష్, వావిలాల రాంబాబు, ఎండీ ఖాజా పాషా పాల్గొన్నారు.