సేవ్ ఫారెస్ట్స్..మంత్రి సత్యవతి పిలుపు

by  |
సేవ్ ఫారెస్ట్స్..మంత్రి సత్యవతి పిలుపు
X

దిశ, వరంగల్: అటవీ జిల్లాగా పేరొందిన ములుగులో అడవులను ఎల్లప్పుడు సంరక్షించాలని మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు.‌ జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులు, హరితహారం కింద పెట్టుకున్న లక్ష్యాలు పూర్తి కోసం కలెక్టర్ కార్యాలయంలో శనివారం సమావేశం నిర్వహించారు.ఇందులో మంత్రితో పాటు జెడ్పీ చైర్మన్ జగదీష్, ఎమ్మెల్యే సీతక్క, కలెక్టర్ కృష్ణ ఆదిత్య, జెడ్పీ సీఈవో పారిజాతం, ఏటూరు నాగారం ఐటీడీఏ పీవో హన్మంతు, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ములుగు జిల్లా అంటేనే 75 శాతం అడవులున్న ప్రాంతమని, రోడ్డు మీద నుంచి వెళ్తుంటే దట్టంగా కనిపించే చెట్లు అడవి లోపలికి వెళ్లి చూస్తే అంతగా కనిపించడం చెప్పారు.ఏరియల్ వ్యూ ద్వారా సర్వే జరిపినప్పుడు చాలా వరకు చెట్లు కోతకు గురవ్వడం బాధ కలిగించిందన్నారు.అడవిలో ఉన్న ఖాళీ ప్రదేశాలను దట్టమైన అడవులుగా మార్చే విధంగా హరితహారంలో బ్లాక్ ప్లాంటేషన్ చేయాలని ఆదేశించారు.‌ ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్‌కి మించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేపట్టాలన్నారు. ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ ములుగు జిల్లాకు అడవితో విడదీయలేని అనుబంధం ఉందన్నారు. ఈ మధ్య కాలంలో పోడు సమస్య బాగా ఉందని, ఎప్పటి నుంచో దున్నుతున్న భూములను కూడా అటవీ అధికారులు స్వాధీనం చేసుకుంటున్నట్లు తెలిపారు. సమస్య పరిష్కారం కోసం సమన్వయ కమిటీ వేయాలని ఆమె కోరారు.


Next Story

Most Viewed