కలెక్టర్లు, అధికారులకు మంత్రి సత్యవతి రాథోడ్ కీలక ఆదేశాలు

by Shyam |
కలెక్టర్లు, అధికారులకు మంత్రి సత్యవతి రాథోడ్ కీలక ఆదేశాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా నుంచి ప్రజలను కాపాడేందుకు అధికారులు, సిబ్బంది పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశించారు. కరోనాపై ప్రజల్లో ధైర్యం కల్పిస్తూ వారికి అండగా నిలవాలని సూచించారు. మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లాల కలెక్టర్లతో మంత్రి సోమవారం టెలీ కాన్ఫరెన్సు నిర్వహించి కరోనా పరిస్థితులను సమీక్షించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా నియంత్రణకు నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని, కరోనా బారిన పడిన వారికి చికిత్స అందించేందుకు ఆసుపత్రుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిరంతరం పర్యవేక్షణ చేయాలని సూచించారు. ఫీవర్ సర్వే ద్వారా గ్రామాల్లో ఇంటింటికి కరోనాపై అవగాహన కల్పించాలని, నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించాలన్నారు. సీఎం కేసీఆర్ నిత్యం కరోనాపై సమీక్ష చేస్తున్న నేపథ్యంలో జిల్లాల్లో ఎప్పటికప్పుడు కరోనా కేసులను, పురోగతి వివరాలను అందజేయాలన్నారు. ఆక్సిజన్, మందుల కొరత, టెస్ట్ కిట్ల కొరత రాకుండా సీఎం అన్ని చర్యలు చేపడుతున్నారని, త్వరలోనే వైద్య సిబ్బంది సైతం పెరుగనున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed