- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏమైందీ..? ఫాస్ట్‌గా చేయండి: సబితా
దిశ ప్రతినిధి, రంగారెడ్డి: మిషన్ భగీరథ పథకం కింద చేపట్టిన పనులు తక్షణమే పూర్తి చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలోని మిషన్ భగీరథ పనులపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎమ్మెల్యే, అధికారులతో లక్డికాపూల్లోని రంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ… రంగారెడ్డిలో 1062 ఆవాసాలకు, వికారాబాద్లో 1062 ఆవాసాలకు తాగునీరు సరఫరా చేయాలని జిల్లా అధికారులు ప్రణాళికలు రూపోందించారని తెలిపారు. ఇందులో ఇప్పటి వరకు 90 శాతం పనులు మాత్రమే పూర్తి చేశారు. మిగిలిన 10 శాతం పనులు పూర్తి చేసి నీరు సరఫరా చేయాలన్నారు. దేశంలో ఏ ప్రభుత్వం చేయని ఆలోచనను సీఎం కేసీఆర్ ఆచరణలో చేశారని తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, జిల్లా కలెక్టర్లు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.