ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు మంత్రి సబితా వార్నింగ్

by Anukaran |   ( Updated:2021-10-21 02:06:57.0  )
Minister Sabitha Indra Reddy
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రస్తుతం ఇంటర్ సెకండియర్ చదువుతున్న విద్యార్థులకు గతంలో నిర్వహించలేని ఫస్టియర్ పరీక్షలు ఈ నెల 25 నుంచి ప్రారంభమవుతున్నాయని, అన్ని ప్రైవేటు జూనియర్ కాలేజీలు పూర్తి సహకారం ఇవ్వాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. పరీక్షల సమయంలో విద్యార్థులను ప్రైవేటు కళాశాలల యాజమాన్యం ఇబ్బందులు పెడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని, విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడడం మంచిది కాదని హెచ్చరించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించవద్దని స్పష్టం చేస్తూనే ప్రస్తుతం ప్రైవేటు యాజమాన్యాలు అవలంబిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న ఫస్టియర్ పరీక్షలకు సుమారు నాలుగున్నర లక్షల మంది విద్యార్థులు హాజరవుతున్నారని, కరోనా నిబంధనలను దృష్టిలో పెట్టుకుని అదనపు సిబ్బందిని, అదనపు పరీక్షా కేంద్రాలను కూడా సిద్దం చేస్తున్నట్లు తెలిపారు. మొత్తం 1750 ఎగ్జామినేషన్ సెంటర్లను పెట్టి పాతికవేల మంది సిబ్బందిని ఇన్విజిలేటర్లుగా వినియోగిస్తున్నట్లు తెలిపారు. పరీక్షలు సజావుగా జరిగేందుకు అన్ని విభాగాలతో సమన్వయం చేసుకుంటున్నట్లు వివరించారు. కరోనా లక్షణాలు ఉంటే వెంటనే విడిగా ఉంచడానికి ఐసొలేషన్ రూమ్‌లను ప్రతి పరీక్షా కేంద్రంలో సిద్దం చేసినట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed