- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది’
దిశ, జల్‌పల్లి: 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని కేంద్రప్రభుత్వం పెద్దపెద్ద ప్రకటనలు చేసింది కానీ.. సరిపడే డోసులు పంపించడంలో మాత్రం పూర్తిగా విఫలం అయిందని విమర్శించారు. తెలంగాణలో ఉత్పత్తైన వ్యాక్సిన్‌ను కూడా నేరుగా కొనుక్కునే పరిస్థితి లేకుండా కేంద్రప్రభుత్వం వ్యవహరిస్తోందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం గ్లోబల్ టెండర్లు పిలిచినా.. కేంద్ర నిర్ణయాలతో సాధ్యం కావడం లేదని, వ్యాక్సినేషన్ దిగుమతిని సరళతరం చేయాలని అభిప్రాయపడ్డారు. శనివారం మహేశ్వరం నియోజకవర్గంలోని జల్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ప్రీమియర్ ఫంక్షన్ హాల్, బడంగ్‌పేట్ కార్పొరేషన్ పరిధిలోని జెడ్పీ హై స్కూల్, మీర్‌పేట్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లా పరిషత్ హై స్కూల్‌లలో హైరిస్క్‌ల కోసం కోవిడ్ 19 వ్యాక్సిన్ టీకా కేంద్రాలను శనివారం మంత్రి ప్రారంభించారు.
సీఎం కేసీఆర్ కరోనా కట్టడికి తీసుకున్న చర్యలతో రాష్ట్రంలో కేసులు తగ్గుముఖం పట్టాయన్నారు. ముఖ్యంగా బ్లాక్ ఫంగస్‌పై దేశంలోనే ముందుగా అధికార యంత్రాంగాన్ని అలర్ట్ చేసి, ఈఎన్‌టీ ఆసుపత్రిలో ప్రత్యేక చికిత్స అందిస్తున్న ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కరోనా థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధంగా ఉందన్నారు. గాంధీతో పాటు అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్‌లు పెంచి కోవిడ్ చికిత్స అందిస్తున్నారు. జిల్లా పరిధిలోని జీహెచ్‌ఎంసీ డివిజన్‌లు, కార్పొరేషన్‌లు, మున్సిపాలిటీలలో కూరగాయలు, పండ్లు, మద్యం, కిరాణా వ్యాపారస్థులతో పాటు హోటల్‌లో పనిచేసే వారికి 10 రోజుల పాటు వ్యాక్సినేషన్ ఇస్తున్నారని, అర్హులైన ప్రతిఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.