Omicron Variant Alert: వ్యాక్సినేషన్‌పై మంత్రి సబిత కీలక ఆదేశాలు

by Shyam |   ( Updated:2021-12-02 04:38:02.0  )
Omicron Variant Alert: వ్యాక్సినేషన్‌పై మంత్రి సబిత కీలక ఆదేశాలు
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ను డిసెంబర్‌ నెలాఖరు నాటికి 100 శాతం సాధించుటకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం వికారాబాద్ జిల్లా డీపీఆర్సీ భవనంలో కొవిడ్ వ్యాక్సినేషన్, ఒమిక్రాన్ వేరియంట్‌పై సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ… మాస్క్ ధరించడం, వ్యాక్సిన్ వేసుకోవడం, భౌతిక దూరం పాటించడం వంటి నియంత్రణ చర్యలను ప్రజలు కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. కరోనా‌తో ఆందోళన పడవద్దని.. అపోహలు, దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని హితవు పలికారు. సంపూర్ణ వ్యాక్సినేషన్ లక్ష్యం కోసం అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని మంత్రి ఆదేశించారు. ఒమిక్రాన్ వేరియంట్‌పై యుద్ధానికి రాష్ట్ర, జిల్లా వైద్య శాఖ సన్నద్ధమవుతుందని గుర్తు చేశారు. ఈ క్రమంలోనే వ్యాక్సినేషన్ వేసుకోకుండా వెనుకంజ వేస్తున్న ప్రజలను.. ప్రజాప్రతినిధులు, అధికారులు మరింత చైతన్యవంతం చేయాలని సూచించారు.



Next Story

Most Viewed