కేసీఆరే మేనమామ.. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

by Shyam |
Minister Sabitha Indra Reddy
X

దిశ, జల్‌పల్లి: కరోనా కష్ట సమయంలోనూ ప్రభుత్వ పథకాలు కొనసాగించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. షాదీముబారక్ పథకంతో మేనమామ మాదిరి ముఖ్యమంత్రి కేసీఆర్ పేదింటి ఆడబిడ్డలకు సహాయం చేస్తున్నారని తెలిపారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా జల్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని పింక్ ప్యాలెస్‌లో షాదీముబారక్ చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బాలాపూర్ మండల పరిధిలో మూడేళ్ల కాలంలోనే 3480 మంది లబ్ధిదారులకు రూ.34 కోట్ల 84 లక్షల షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశామన్నారు. ఈ పథకం వినియోగంలో మహేశ్వరం నియోజకవర్గం జిల్లాలోనే మొదటి స్థానంలో ఉందని, పెద్ద ఎత్తున నిధులు ఇస్తోన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నియోజకవర్గ ప్రజల తరుపున ధన్యవాదాలు తెలియజేశారు.

కేసీఆర్ కిట్‌తో ప్రైవేటు ఆసుపత్రుల బాధలు తగ్గాయని, ఆడపిల్ల పుడితే రూ.13 వేలు, మగపిల్లవాడు పుడితే రూ.12 వేలు ఇస్తోన్న ఏకైక ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం అని వెల్లడించారు. అంతేగాకుండా.. కేసీఆర్ కిట్ మూలంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరిగాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జల్‌పల్లి మున్సిపాలిటీ చైర్మన్ అబ్దుల్లా సాధి, వైస్ చైర్మన్ ఫర్హానా నాజ్, బాలాపూర్ తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, కమిషనర్ జీపీ కుమార్, కౌన్సిలర్లు మజర్ అలీ, లక్ష్మీనారాయణ, శంషుద్దీన్, కో-ఆప్షన్ సభ్యులు సూరెడ్డి కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు ఇక్బాల్ బిన్ ఖలీఫా, యూసుఫ్ పటేల్, కైసర్ బామ్, షేక్ అఫ్జల్ తదితరులు పాల్గొన్నారు.


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story