- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గోవాకు మంత్రి పువ్వాడ.. ఘనంగా స్వాగతించిన తెలుగు అసోసియేషన్
దిశ ప్రతినిధి, ఖమ్మం: రెండు రోజులు పాటు గోవా పర్యటనకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వెళ్లారు. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సహం, పెట్టుబడులను ఆకర్షించే మార్గాలపై కేంద్రం.. భారీ పరిశ్రమల మంత్రిత్వశాఖ అధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసింది. వివిధ రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులు, ముఖ్య కార్యదర్శులు, పరిశ్రమ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు, సాంకేతిక నిపుణుల ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరవుతారు.
ఈ మేరకు గోవాలోని లాలిట్ గోల్ఫ్, స్పా రిసార్ట్, కెనకోనాలో జరిగే ఈ సమావేశంలో పాల్గొననున్నారు. శుక్రవారం గోవా చేరుకున్న మంత్రి పువ్వాడకు అక్కడి తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు విమానాశ్రయంలో స్వాగతం పలికారు. అందులో గోవా తెలుగు అసోసియేషన్ కార్యదర్శి శ్రీనివాస రెడ్డి, ట్రెజరర్ కె.శ్రీనివాస్, బిట్స్ పిలాని ప్రసాద్, సుధాకర్ రెడ్డి, సూరి బాబు, మురళి కృష్ణ, రమణ, కృష్ణ రెడ్డి, ధనుంజయ్ తదితరులు ఉన్నారు.