- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కేసీఆర్ నిర్ణయంపై మంత్రి పువ్వాడ హర్షం
by Sridhar Babu |

X
దిశ, ఖమ్మం: పేదింటి ఆడబిడ్డల కుటుంబాలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు రూ.612 కోట్లు విడుదల చేయడం పట్ల రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రూ.612.50 కోట్ల నిధులు విడుదల చేయడం అభినందనీయం అన్నారు. కల్యాణలక్ష్మి పథకానికి ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.1,850 కోట్లు ప్రభుత్వం కేటాయించిందన్నారు. ఇప్పటికే రెండు త్రైమాసికాలకు రూ.925 కోట్లు విడుదల చేసిందని, తాజాగా మూడో త్రైమాసికానికి రూ.462.50 కోట్లు విడుదల చేసిందన్నారు. షాదీముబారక్ పథకానికి ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.300 కోట్లు కేటాయించి ఇప్పటికే రూ.150 కోట్లు విడుదల చేసి, తాజాగా మిగిలిన రూ.150 కోట్లు విడుదల చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందన్నారు.
- Tags
- kalyanalakshmi
Next Story