‘సచివాలయ పరీక్షలు.. ప్రత్యేక జాగ్రత్తలు’

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సచివాలయ పోస్టుల భర్తీలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బుధవారం పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో పరీక్షలను తగు నిబంధనలను పాటిస్తూ నిర్వహించాలని చెప్పారు.

మొత్తం 16,208 పోస్టులు ఖాళీలకు 10, 56,931 మంది అభ్యర్థలు దరఖాస్తు చేసుకున్నట్టు పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ 20 నుంచి పరీక్షలు నిర్వహిస్తున్నామని.. 7 రోజుల పాటు కొనసాగుతాయని వెల్లడించారు. కరోనా పాజిటివ్ ఉన్న అభ్యర్థుల కోసం కూడా.. ప్రత్యేకంగా ఐసోలేషన్ రూములను ఏర్పాటు చేశామని తెలిపారు. అభ్యర్థులు కరోనాతో కంగారు పడాల్సింది ఏమీ లేదని.. పరీక్షలకు సర్వ సిద్ధం చేసినట్టు మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం చేశారు.

Advertisement