ఇల్లందు అభివృద్ధే లక్ష్యం : ఎమ్మెల్యే హరిప్రియ నాయక్

by Sridhar Babu |   ( Updated:2021-08-20 03:46:11.0  )
MLA Haripriya Naik
X

దిశ, ఇల్లందు: నియోజకవర్గ సంపూర్ణ అభివృద్ధే తమ ధ్యేయమని ఇల్లందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ నాయక్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆమె కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో కోల్డ్ స్టోరేజ్ మరియు వెజిటబుల్ హోల్ సేల్ మార్కెట్‌కు ఏర్పాటుకు కృషి చేయాలని మంత్రిని ఆమె కోరారు. కోల్డ్ స్టోరేజ్ నిర్మిస్తే.. ఇల్లందు, టేకులపల్లి మండలాల్లో రైతులు కష్టపడి పండించిన కూరగాయలు అమ్ముకోవడానికి వీలుంటుందని తెలిపారు. ఎమ్మెల్యే అభ్యర్థన మేరకు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఎమ్మెల్యే వెంట ఏఎంసీ చైర్మన్ భానోత్ హరిసింగ్ నాయక్, బయ్యారం వైస్ ఎంపీపీ తాత గణేష్, లీగల్ అడ్వైజర్ సతీష్ ఉన్నారు.

Advertisement

Next Story