- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘సహకారం లేకుండా సమాజమే లేదు’
by Shyam |
X
దిశ ప్రతినిధి, హైదరాబాద్: సహకారం లేకుండా సమాజమే లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. మంగళవారం నాంపల్లి గృహకల్పలో తెలంగాణ కో-ఆఫ్ గెజిటెడ్ అధికారుల సంఘం డైరీని ఆయన మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ గోరటి వెంకన్నతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. మంచి పనికి ఒక రోజు ఖచ్చితంగా గుర్తింపు ఉంటుందన్నారు. సహకార శాఖ లేకుంటే కరోనా సమయంలో ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు కలిగేవని, మానవ సమూహం, సమాజంలో సహకారం లేకుండా జీవనం సాగదన్నారు. డబ్బుంటే తనకేమీ అక్కర్లేదు అనే భ్రమలో ఉన్న మనుషులకు కరోనా గుణపాఠం నేర్పిందన్నారు.
Advertisement
Next Story