ఆ శక్తి కేంద్ర ప్రభుత్వానికి లేదా : మంత్రి నిరంజన్ రెడ్డి

by Shyam |   ( Updated:2021-11-13 01:44:34.0  )
Minister Niranjan Reddy
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం తక్షణమే తెలంగాణలో పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ నాయకులు ధర్నా చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శనివారం వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులను ఇబ్బందులు పెట్టిన గత ప్రభుత్వాలు అధికారానికి దూరమయ్యాయని పేర్కొన్నారు. రైతులను ఇబ్బంది పెడితే వారే శిక్షిస్తారని విమర్శించారు.

ధాన్యం కొనుగోలుపై కేంద్రం స్పష్టమైన వైఖరి చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. ‘‘రైతులను బాధపెట్టే ప్రభుత్వాలకు ఉసురు తగులుతుందన్నారు. మూడు నల్లచట్టాలతో రైతుల మెడపై కత్తి వేలాడుతోందని విమర్శించారు. దేశంలో 20-22 కోట్ల మందికి ఇప్పటికీ తిండి గింజలు లేవు. ఎంతో మందికి ఆహారం దొరకట్లేదు. రైతుల కోసం వేల కోట్లు ఖర్చు చేసే శక్తి కేంద్ర ప్రభుత్వానికి లేదా?’’అని కేంద్రాన్ని ప్రశ్నించారు.

Advertisement

Next Story

Most Viewed