సేంద్రీయ పంటలను ప్రోత్సహిస్తాం : మంత్రి నిరంజన్ రెడ్డి

by Shyam |
Minister Niranjan Reddy
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం తరపున సేంద్రీయ సాగు చేసే రైతులను ఆర్థికంగా ప్రోత్సహించేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. గురువారం మండలిలో మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో చాలామంది మిద్దె పంటలను ప్రోత్సహిస్తున్నారని.. వారికి కావాల్సిన కూరగాయలు వారే పండించుకుంటున్నారని మంత్రి తెలిపారు. ఇది వ్యవసాయ రంగంలో మంచి పరిణామమని ఆయన తెలిపారు.

ఈ క్రమంలో రాష్ట్రంలో 26 వేల మిద్దె తోటలు ఉన్నాయని, మిద్దె సాగు చేసే వారికి ఉద్యానశాఖ సబ్సిడీలు ఇస్తోందని పేర్కొన్నారు. మండలిలో ఉన్న ప్రజాప్రతినిధులు కూడా మిద్దె తోటలు సాగు చేయాలని మంత్రి కోరారు. రైతులకు, ప్రజలకు మనమంతా ఆదర్శంగా ఉండి మిద్దెసాగు వైపు మళ్లేలా దారిచూపాలని చెప్పారు. అయితే, రైతులను ఒక్కసారిగా సేంద్రీయ సాగు మాత్రమే చేయాలని, రసాయన ఎరువులు వాడొద్దని చెప్పి వారిని ఇబ్బంది పెట్టబోమన్నారు. దీనిపై పక్కా ప్రణాళికతో రైతులను సేంద్రీయ పంటవైపు మళ్లించే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed