ఎందుకిలా చేస్తున్నారు.. కేంద్రంపై మంత్రి నిరంజన్ రెడ్డి ఫైర్

by Shyam |   ( Updated:2021-11-09 01:25:37.0  )
ఎందుకిలా చేస్తున్నారు.. కేంద్రంపై మంత్రి నిరంజన్ రెడ్డి ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎరువుల కేటాయింపులో తెలంగాణపై ఎందుకు వివక్ష చూపుతున్నారంటూ కేంద్ర ప్రభుత్వంపై వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎరువుల కొరత సందర్భంగా రైతులు ఇబ్బంది పడుతున్నట్లు పేర్కొన్నారు. అవసరాలకు అనుగుణంగా తెలంగాణకు వెంటనే ఎరువులు సరఫరా చేయాలని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయకు ఆయన లేఖ రాశారు.

యాసంగిలో 20.5 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు సరఫరా చేస్తామని హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. దీనిలో భాగంగా అక్టోబరు, నవంబర్‌లో 6.4 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు రావాల్సి ఉండగా, కేవలం 3.67 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కేటాయించినట్లు తెలిపారు. దానిలోనూ ఇప్పటి వరకు 1.55 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే అందించారన్నారు. ఈ నేపథ్యంలోనే అక్టోబర్, నవంబర్ నెలలలో తక్కువగా సరఫరా చేసిన ఎరువులను డిసెంబర్ నుండి మార్చి సరఫరాలో భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed