ప్రణబ్ బహుముఖ ప్రజ్ఞాశాలి : మల్లారెడ్డి

దిశ ప్రతినిధి, మేడ్చల్: భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి యావత్ భారతదేశానికి తీరని లోటని కార్మిక శాఖ మంత్రి చామకూర మాల్లారెడ్డి ప్రగాఢ సంతాపం తెలిపారు. బహుముఖ ప్రజ్ఞాశాలి, ఆరు దశాబ్దాలు తన మేథో సంపత్తిని భారతదేశ అభివృద్ధికి సద్వినియోగం చేసిన మహనీయుడు అన్నారు. రాజకీయాలకు అతీతంగా అందరి మన్ననలు పొంది అజాత శత్రువుగా పేరుగాంచిన మహా మనిషి అని తెలిపారు. ఆయన రాష్ట్రపతిగా ఉండగా, తాను ఒక లోక్ సభ సభ్యునిగా ఉన్నానని గుర్తుచేసుకున్నారు.

Advertisement