- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను: మల్లారెడ్డి
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్: కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డికి కరోనా పాజిటివ్ వచ్చిన విషయం విదితమే. గత ఆదివారం ఆయనకు టెస్టులు చేయగా కరోనా నిర్దారణ అయ్యింది. అప్పటి నుంచి ఇంట్లో ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు. ఇదిలాఉంటే తనకు కరోనా సోకడంపై మంత్రి స్పందిచారు.
ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నానని వివరించారు. కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ వచ్చిందని తెలియగా షాక్‌కు గురయ్యానని.. అప్పటి నుంచి సెల్ఫ్ ఐసోలేషన్లో చికిత్స తీసుకోగా ఇప్పుడు పూర్తిగా కోలుకున్నానని చెప్పారు. ప్రస్తుతం తనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని.. పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. కరోనా నుంచి ఎలా బయటపడాలో కూడా తెలిపారు. లక్షణాలు ఉన్నవారు భయపడాల్సిన అవసరం లేదని.. మెడిసిన్‌తో తీసుకుంటూ, ధైర్యంగా ఉంటే పూర్తిగా కోలుకోవచ్చునని మంత్రి మల్లారెడ్డి వెల్లడించారు.
Next Story