డబుల్ బెడ్ రూం ఇండ్ల ప్రారంభం….ఎప్పుడంటే

by Shyam |
డబుల్ బెడ్ రూం ఇండ్ల ప్రారంభం….ఎప్పుడంటే
X

దిశ ప్రతినిధి , హైదరాబాద్:
కార్వాన్ నియోజకవర్గ పరిధిలోని జియాగూడ, గోషామహల్ నియోజకవర్గ పరిధిలోని గోడే ఖీ కబర్, కట్టెల మండిలలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఈ నెల 26న మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. ఈ మేరకు ఏర్పాట్లపై శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఈ నెల 26న ఉదయం 10గంటలకు జియాగూడలోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభిస్తారనీ, 10.30 గంటలకు గోషామహల్ నియోజకవర్గ పరిధిలోని గోడే ఖీ కబర్, 11.00 గంటలకు కట్టెల మండిలో నిర్మించిన ఇండ్లను ప్రారంభిస్తారని వెల్లడించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హోం మంత్రి మహమూద్ అలీ కూడా పాల్గొంటారని తెలిపారు. జియాగూడలో 840, గోషామహల్ నియోజకవర్గ పరిధిలోని గోడే ఖీ కబర్ లో 192, కట్టెల మండిలో 128 ఇండ్లను

నిర్మించినట్లు చెప్పారు. పేద ప్రజలకు వైద్యసేవలు చేరువ చేసేందుకు ప్రతి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల
నిర్మాణం వద్ద ఒక బస్తీ దవాఖాన ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 26 నాటికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తూ ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed