సమాధులను కూల్చివేస్తామంటే కేటీఆర్ రియాక్షన్..!

by Shyam |   ( Updated:2020-11-25 05:22:53.0  )
సమాధులను కూల్చివేస్తామంటే కేటీఆర్ రియాక్షన్..!
X

దిశ, వెబ్‌డెస్క్: దివంగత ప్రధాని పీవీ నరసింహారావు, స్వర్గీయ ఎన్టీఆర్‌ సమాధులను కూల్చివేస్తామని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ చేసిన సంచలన వ్యాఖ్యల పై కేటీఆర్ ట్విట్టర్‌లో స్పందించారు. ఇటువంటి వ్యాఖ్యలకు ప్రజాస్వామ్యంలో చోటేలేదన్నారు. ‘మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీ పివి నరసింహారావు, ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ శ్రీ ఎన్టీఆర్ గార్లపై ఈ రోజు మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన అనుచితమైన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ ఇరువురు నాయకులు కూడా తెలుగు ప్రజల గౌరవాన్ని నిలబెట్టిన మహనీయులు. ఒకరు ప్రధానిగా, మరొకరు ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం ప్రజాసేవలో ఉన్నారు. అటువంటి మహానాయకులపై అనుచిత వ్యాఖ్యలు గర్హనీయం. ప్రజాస్వామ్యంలో ఇటువంటి వ్యాఖ్యలకు చోటులేదు.’ అంటూ మున్సిపల్ మినిస్టర్ కేటీఆర్ ట్వీట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed