ఐఐటీ విద్యార్థినికి కేటీఆర్ ఆర్థిక సాయం..

by  |
ఐఐటీ విద్యార్థినికి కేటీఆర్ ఆర్థిక సాయం..
X

దిశ, వెబ్‌డెస్క్: ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతన్న ఐఐటీ విద్యార్థినికి మున్సిపల్, ఐటీ మంత్రి కేటీఆర్ సోమవారం ఆర్థిక సాయం ప్రకటించారు. వరంగల్‌కు చెందిన అంజలి మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఐఐటీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది.

చదువులో ఎన్నడూ ముందుండే అంజలిని ఆర్థిక ఇబ్బందులు వేధించసాగాయి. ఈ విషయం మంత్రి కేటీఆర్ దగ్గరికి వెళ్లడంతో ఆయన రూ. 1లక్షా 50వేలు చేయూతను అందించారు. కాగా, అంజలి హసన్‌పర్తిలోని గురుకుల పాఠశాలలో తన ఇంటర్ విద్యాభ్యాసం పూర్తి చేసింది. దీంతో మంత్రి ఆమెను అభినందించడమే కాకుండా, కోరుకున్న లక్ష్యాన్ని సాధించాలని సూచించారు.


Next Story

Most Viewed