- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెట్టుబడిదారులకు అండగా ఉంటాం: కేటీఆర్
దిశ, న్యూస్‌బ్యూరో: పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే విదేశీ కంపెనీలు స్థూలంగా భారతదేశాన్ని ఒక యూనిట్‌గా కాకుండా తెలంగాణ లాంటి ప్రోగ్రెసివ్ రాష్ట్రాలను ఒక యూనిట్‌గా పరిగణనలోకి తీసుకోవాలని పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ సూచించారు. స్థూలంగా అన్ని రాష్ట్రాలను కలిపి చూసినప్పుడు ఉండే పెట్టుబడి అవకాశాలకు, పరిస్థితులకు ప్రత్యేకంగా తెలంగాణ లాంటి రాష్ట్రాలను సూక్ష్మంగా పరిశీలించినప్పుడు అవకాశాలకు చాలా తేడా ఉంటుందన్నారు. యూఎస్ఐబీసీ ఇన్వెస్ట్మెంట్ వెబినార్‌లో గురువారం మంత్రి పాల్గొన్నారు. దేశంలోనే అత్యంత తక్కువ వయసు కలిగిన రాష్ట్రమైన తెలంగాణ నూతన విధానాలు, ప్రభుత్వ నిర్ణయాల పరంగా వినూత్నమైన పంథాలో ముందుకు పోతుందన్నారు. విధానాల ద్వారా గత ఆరేళ్లుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్‌లో అగ్రస్థానంలో కొనసాగుతూ వస్తుందని గుర్తుచేశారు. టీఎస్ ఐపాస్ విధానం ద్వారా కేవలం 15రోజుల్లోనే అన్నిరకాల పెట్టుబడులకు అనుమతులు ఇస్తున్నామని, ఇప్పటికే ఈ విధానం విజయవంతమైందన్నారు. అనుమతులు ఇచ్చిన వాటిలో 80శాతానికి పైగా కార్యకలాపాలను ప్రారంభించిన విషయాన్ని పెట్టుబడిదారులకు మంత్రి కేటీఆర్ వివరించారు.
ప్రస్తుతం కరోనా సమయంలోనూ ప్రభుత్వం పరిశ్రమలకు అండగా నిలబడుతుందని, తీసుకున్న చర్యలను వివరించారు. రాష్ట్రంలోని లైఫ్ సైన్సెస్, ఫార్మా రంగానికి సంబంధించి బలమైన ఈకో సిస్టం ఇక్కడ ఉందని, ప్రస్తుతం అమెరికా వంటి అగ్ర రాజ్యం సైతం ఇక్కడి కంపెనీలు ఉత్పత్తి చేసే కరోనా మందుల పైన ప్రధానంగా ఆధారపడుతున్న విషయాన్ని ప్రస్తావించారు. అనేక ఐటీ కంపెనీలు అమెరికా తర్వాత అతి పెద్ద ప్రాంగణాలను హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన విషయాన్ని కూడా మంత్రి కేటీఆర్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. దేశంలోనే అతిపెద్ద మెడికల్ డివైస్ పార్క్ తెలంగాణలో ఉందని, ఈ రంగంలోనూ అద్భుతమైన పెట్టుబడి అవకాశాలు ఉన్నాయన్నారు. ఇన్వెస్ట్మెంట్ వెబినార్‌లో పాల్గొన్న అమెరికన్ కంపెనీల అధినేతలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాతావరణాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రధానంగా టీఎస్ ఐపాస్ విధానం, ప్రభుత్వం పరిశ్రమలకు అందిస్తున్న మద్దతు పైన తెలంగాణ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీల అధినేతలు ప్రశంసించారు.
సంపూర్ణ సహకారం
తెలంగాణకు పెట్టుబడులు తీసుకువచ్చేందుకు సంపూర్ణ సహకారం ఉంటుందని యూఎస్ఐబీసీ ప్రెసిడెంట్ నిషా బిశ్వాల్ తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ విధానాలు పరిశ్రమలకు అందిస్తున్న చేయూతను ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించారు. అయితే ప్రస్తుతం ఉన్న కరోనా సంక్షోభం తర్వాత రాష్ట్రానికి వచ్చే పెట్టుబడుల విషయంలో ప్రభుత్వంతో కలిసి పని చేస్తామన్నారు. అమెరికాకు చెందిన ఫార్మా, టెక్నాలజీ, మాన్యుఫ్యాక్చరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, ఎనర్జీ, రిటైల్ వంటి రంగాల నుంచి పదుల సంఖ్యలో పెట్టుబడిదారులు, కంపెనీల అధినేతలు వెబినార్‌లో పాల్గొన్నట్లు ఆమె తెలిపారు.