మంత్రి జగదీశ్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడింది ఇదే..

by Shyam |   ( Updated:2021-03-16 02:53:05.0  )
MInistar Jagadish reddy
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: జీవితాంతం పేద ప్రజల కోసం పోరాటం చేసిన నేత నోముల నర్సింహయ్య అని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి రాజకీయ జీవితాన్ని అంకితమిచ్చిన నేతని ఆయన కొనియాడారు. మంగళవారం శాసనసభ సమావేశాలల్లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దివంగత నోముల నర్సింహయ్య మరణంపై ప్రవేశ పెట్టిన సంతాప తీర్మానాన్ని బలపరుస్తూ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడారు.

తెలంగాణా సాయుధ, రైతాంగ పోరాట స్ఫూర్తిని పుణికి పుచ్చుకుని రాజకీయాల్లో రాణించిన ఆయన, భూస్వామ్యా పెత్తందారీ వర్గాలకు వ్యతిరేఖంగా ప్రశ్నించిన గొంతుక నోములదని మంత్రి అభివర్ణించారు. మార్కిస్టు నేత నర్రా రాఘవ రెడ్డి అనుచరుడిగా అనేక ప్రజా ఉద్యమాల్లో భాగస్వామ్యం పంచుకున్నారని గుర్తు చేశారు. అంతే గాకుండా తెలంగాణా రాష్ట్రం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమం జరుగుతున్న సందర్భంలో తాను రాసిన వ్యాసాలపై స్పందిస్తూ సూర్యాపేట లో మొట్టమొదటి సారిగా నోముల నరసింహ్మయ్య కలుసుకున్న సందర్భాన్ని మంత్రి జగదీష్ రెడ్డి ఈ సందర్భంగా ఉటంకించారు. సీపీఎం నేతగా నాడు తాను రాసిన వ్యాసంపై పార్టీ డిఫెన్స్ లో పడిందని చెబుతూనే ఎన్నటికో ఒక నాడు నేను మీ దారిలోకీ వస్తానంటూ చెప్పిన తీరుగానే రాష్ట్రం ఏర్పడ్డ తరువాత జరిగిన 2014 ఎన్నికల నాటికి టీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ లోకి వచ్చారని ఆయన గుర్తు చేసుకున్నారు. అటువంటి నేత నేడు మనమధ్యలో లేక పోవడం దురదృష్టకరమన్నారు.

Advertisement

Next Story

Most Viewed