ఏపీ ప్రభుత్వ నిర్ణయాలు హాస్యాస్పదం : మంత్రి జగదీష్ రెడ్డి

by Shyam |
Minister Jagadish Reddy
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయితీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కారణమని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. గురువారం టీఎస్‌ఎస్పీడీసీఎల్ అసిస్టెంట్ డివిజనరల్ ఇంజనీర్(స్టోర్స్) కార్యాలయం ప్రారంభించిన సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం ఆకతాయి పిల్లాడిలా వ్యవహారించి, కేంద్ర బలగాలను కోరడం వారి చేతగాని తనానికి నిదర్శనమన్నారు. ఏపీ ప్రభుత్వం ముందుగా జీఓ 203ను ఉపసంహరించుకోవాలన్నారు. పొరుగు రాష్ట్రం స్నేహహస్తం అందించినా.. దాన్ని ఉపయోగించుకోలేదని తెలిపారు. జలవివాదంలో అటు కేంద్రానికి.. ఇటు సుప్రీం కోర్టుకు ఫిర్యాదు చేయడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులన్నీ సక్రమమేనని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీకోర్టుకు వెళ్లినా ఇబ్బంది లేదన్నారు. నీటి వాటా తేల్చాలని మేం కూడా సుప్రీం కోర్టును అడుగుతున్నామని, ఏపీ ప్రభుత్వం విజ్ఞతతో వ్యవహరిస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed