- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బీజేపీ దొంగ దీక్షలు చేస్తోంది !

X
దిశ, వెబ్‌డెస్క్: దుబ్బాక ఉప ఎన్నికలో గెలవలేక బీజేపీ దొంగ దీక్షలు చేస్తోందని మంత్రి జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. హుజూర్‌నగర్ ఉపఎన్నికల్లో సైతం కాంగ్రెస్, బీజేపీ నేతలు ఇలాగే ఎగిరారని విమర్శించారు. తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంపై విశ్వాసం ఉందని, దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీకి ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు. ఎవరెన్ని జిమ్మిక్కులు చేసినా అంతిమ విజయం టీఆర్ఎస్ పార్టీదేనని పేర్కొన్నారు. బుధవారం హుజూర్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని మఠంపల్లి వద్ద తెలంగాణ, ఏపీ రాష్ట్రాలను కలుపుతూ కృష్ణానదిపై నిర్మించిన బ్రిడ్జిని మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి ప్రారంభించి అనంతరం మీడియాతో మాట్లాడారు.
Next Story