- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఇవే దేశంలో తెలంగాణను నెంబర్ వన్ స్థానంలో నిలిపాయి’
దిశ ప్రతినిధి, నల్లగొండ: కారు గుర్తుకు ఓటేస్తేనే ప్రజల జీవితాల్లో వెలుగులు నిండుకుంటాయని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. నకిరేకల్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పలువార్డుల్లో పర్యటించి, ఈ సందర్భంగా మాట్లాడారు. నకిరేకల్ ప్రాంతం అభివృద్ధి జరగాలంటే మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. కారు గుర్తుకు ఓటేస్తే కలిగే లాభాలను ఓటర్లకు వివరించారు. 2014 సంవత్సరంలో కారు గుర్తుకు వేసిన ఓటు వల్లే రాష్ట్రం బంగారు తెలంగాణగా మారిందని, రైతులు, వృద్ధులు, వికలాంగులు, మహిళలు, సబ్బండ వర్గాల జీవితాల్లో వెలుగులు వచ్చాయని మంత్రి చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్‌ను గెలిపించిన ప్రతిసారీ తెలంగాణ మరింతగా పురోగమించిందని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ విజన్, దార్శనికత తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిపాయన్నారు. ఈ రోడ్ షోలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ తదితరులు పాల్గొన్నారు.