అంబేడ్కర్‌ ఆశయ సాధన అందరి బాధ్యత

by Aamani |   ( Updated:2020-04-14 02:03:37.0  )
అంబేడ్కర్‌ ఆశయ సాధన అందరి బాధ్యత
X

దిశ, ఆదిలాబాద్: అంబేద్కర్‌ ఆశయ సాధనకు అందరూ కృషిచేయాలని మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం మినీ ట్యాంక్‌బండ్‌పై అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ అంబేడ్కర్ చలువతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన మార్గాన్ని ఆదర్శంగా తీసుకుంటారని తెలిపారు. కరోనా నివారణకు ప్రభుత్వం ఇచ్చే సూచనలను ప్రతి ఒక్కరూ పాటించాలని కోరారు. అనంత‌రం మున్సిప‌ల్ కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

Tags: Adilabad,Minister Allola Indrakarn reddy,Dr.BR Ambedkar



Next Story

Most Viewed