- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రతి ఆదివారం ‘‘డ్రైడే’’ గా పాటిద్దాం: మంత్రి అల్లోల
by Aamani |
X
దిశ, ఆదిలాబాద్: మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు స్వచ్ఛత కార్యక్రమాన్ని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని తన నివాసంలో మంత్రి కుటుంబ సభ్యులతో కలసి చెత్తను తొలగించారు. పరిసరాల్లో నిలిచిపోయిన నీటిని తొలగించారు. నివాస ఆవరణలో ఉన్న బావిని క్లోరినేషన్ చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఆదివారం నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరూ ప్రతి ఆదివారాన్ని “డ్రైడే” గా పాటించాలని పిలుపునిచ్చారు. మలేరియా, డెంగ్యూ, చికెన్‌గున్యా తదితర సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఈ కార్యక్రమం ఎంతగానో సహాయపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, టీఆర్ఎస్ నాయకుడు గౌతంరెడ్డి పాల్గొన్నారు. మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్‌రావు మృతి పట్ల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంతాపం తెలిపారు.
Advertisement
Next Story