- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
‘రైతులు దేవుళ్లతో సమానం’

X
దిశ, ఆదిలాబాద్: సాగునీటి ప్రాజెక్టుల కోసం భూములు ఇచ్చిన రైతులు దేవుళ్లతో సమానమని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. రైతులు ఆర్థికంగా బలోపేతం కావడమే ప్రభుత్వ లక్షమన్నారు. నిర్మల్ కలెక్టరేట్‌లో గురువారం కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్యాకేజ్ నెంబర్ 28 భూసేకరణ పరిహారం చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి 27, 28 ప్యాకేజ్ పనులు పూర్తయితే లక్ష ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతుందన్నారు. 27వ ప్యాకేజ్ పనులు రూ.700 కోట్ల వ్యయంతో, 28వ ప్యాకేజ్ పనులు రూ. 500 కోట్ల వ్యయంతో చేపడుతున్నామని మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి భూసేకరణ పరిహారం కింద తానూర్ మండలానికి చెందిన 113 మంది భూ నిర్వాసితులకు రూ. 8.12 కోట్ల చెక్కులను పంపిణీ చేశారు.
Next Story