చిరు వ్యాపారులకు అండ… ఆత్మ నిర్భర్

by  |
చిరు వ్యాపారులకు అండ… ఆత్మ నిర్భర్
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: ఆత్మ నిర్భర్ పథకం కింద అర్హులైన చిరు వ్యాపారులందరికీ రుణాలు మంజూరు చేయడం జరుగుతుందని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. గురువారం నిర్మల్ పట్టణంలోని దివ్య గార్డెన్‌లో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మ నిర్భర్ పథకంలో భాగంగా రుణ వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

కరోనా వ్యాధి కారణంగా ఉపాధి కోల్పోయిన వీధి వ్యాపారులకు మళ్ళీ వ్యాపారం వృద్ధి చెందాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారికి ఆర్థిక చేయూత అందించేందుకు ఆత్మ నిర్భర్ భారత్ పథకం కింద రూ.10 వేల రుణాలు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటివరకూ నిర్మల్ పట్టణంలో 1123 మంది చిరు వ్యాపారులకు వివిధ 22 బ్యాంకుల ద్వారా రుణం జమ చేయడం జరిగిందన్నారు.

12 మాసాల్లో రుణ వాయిదాలు చెల్లించిన అనంతరం రూ.20 వేలు రుణం పొందవచ్చన్నారు. జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ మాట్లాడుతూ… బ్యాంకుల వారీగా నిర్దేశించిన లక్ష్యాల మేరకు అర్హులైనా చిరు వ్యాపారలందరికీ రుణాలు మంజూరు చేస్తామన్నారు. అంతేగాకుండా మహిళా సంఘాలకు స్త్రీ నిధి రుణాల చెక్కులను పంపిణీ చేశారు. లబ్దిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.


Next Story

Most Viewed