ప్రణబ్ ముఖర్జీ గొప్ప రాజనీతిజ్ఞుడు

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆత్మకు శాంతి క‌ల‌గాల‌ని, ఆ భ‌గ‌వంతుడు వారి కుటుంబ స‌భ్యుల‌కు మ‌నోధైర్యాన్ని ప్రసాదించాల‌ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రార్థించారు. ప్రణబ్ ముఖర్జీ మరణంతో భారతదేశం గొప్ప రాజనీతిజ్ఞుడిని కోల్పోయిందని తెలిపారు.

1991లో తాను ఎంపీగా ఉన్న సమయంలో ప్రణబ్ ముఖర్జీ గారితో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న కాలంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆయన కీలక పాత్ర పోషించారని ఆయన సేవలను కొనియాడారు. 2015లో రాష్ట్రపతిగా ఉన్న సమయలో హైదరాబాద్‌లో ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీని క‌లిసి పలు అంశాలపై చర్చించిన విషయాన్ని మంత్రి గుర్తు చేసుకున్నారు.

Advertisement