- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రామలింగారెడ్డి మృతి తీరని లోటు

X
దిశ, సిద్దిపేట: దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతి ఉమ్మడి మెదక్ జిల్లాకు, తనకు వ్యక్తిగతంగా తీరని లోటని మంత్రి హరీశ్‌రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉద్యమ సహచరుడిగా, తోటి ప్రజా ప్రతినిధిగా ఆయనతో తనకు ఎన్నో ఏళ్ల అనుబంధం ఉందన్నారు. దుబ్బాక అభివృద్ధి కోసం, ప్రజల కోసం నిత్యం పరితపించిన నాయకుడు సోలిపేట అని.. తెలంగాణ ఉధ్యమంలో జర్నలిస్టుగా, ఉధ్యమ కారుడిగా కీలక పాత్ర పోషించారని మంత్రి గుర్తు చేశారు. ‘‘నేను లింగన్న’’ అని అత్మీయంగా పిలుచుకునే మంచి మనిషిని కోల్పోవడం దురదృష్టకరమన్నారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని అని హరీశ్ రావు ట్విట్టర్ ద్వారా సంతాపాన్ని తెలిపారు.
Next Story