డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఫ్రీ.. మరో గుడ్‌న్యూస్ చెప్పిన మినిస్టర్

by Anukaran |
డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఫ్రీ.. మరో గుడ్‌న్యూస్ చెప్పిన మినిస్టర్
X

దిశ, గజ్వేల్: మధ్య తరగతి ప్రజలకు మినిస్టర్ హరీశ్ రావు గుడ్‌న్యూస్ చెప్పారు. రూపాయి ఖర్చు లేకుండానే నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని మరోసారి గుర్తు చేశారు. ఆదివారం గజ్వేల్-ప్రజ్ఞా‌పూర్ పరిధిలో నిర్మించిన 1250 రెండు పడక గదుల గృహాలకు లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ, దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇండ్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు దక్కాలన్నదే సీఎం ఆకాంక్ష అన్నారు. గజ్వేల్ – ప్రజ్ఞాపూర్ పరిధిలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల దరఖాస్తుల స్వీకరణకు వార్డుకో ఆఫీస్ చొప్పున 20 ఆఫీస్‌లు ఏర్పాటు చేశామన్నారు. ఈ నెల 13 నుంచి 21 వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. దరఖాస్తుల స్వీకరణ పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులుగా నలుగురు జిల్లా (డీఈవో, డీబీసీవో, డిఎస్సిసీడివో, డివిఎహెచ్‌వో) అధికారులను నియమించామన్నారు. పైరవీకారులను అసలే నమ్మొద్దని.. లంచం తీసుకున్న వారిపైనే కాదు, ఇచ్చిన వారి పై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎవరికైన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు దక్కకపోతే.. సదరు వ్యక్తుల సొంత స్థలాల్లో ప్రభుత్వ డబ్బులతో ఇండ్లు నిర్మించుకునే వెసులుబాటు కల్పిస్తామని హరీశ్ రావు చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed