- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రజా ప్రయోజనాల కోసం ఢిల్లీకి వచ్చాం.. కేంద్రంపై హరీష్ రావు ఫైర్
దిశ సిద్దిపేట: సిద్ధిపేట జిల్లాలో సాధారణ పంట సాగుతో పాటు, నాణ్యమైన విత్తనోత్పత్తి, విత్తన ప్రాసెసింగ్‌కు కావాల్సిన వనరులు సిద్ధిపేటలో పుష్కలంగా ఉన్నాయి. జిల్లాలో విత్తనోత్పత్తి, విత్తన ధృవీకరణకై సేవలు విస్తృతం చేస్తున్నామని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. జిల్లా కేంద్రమైన సిద్దిపేట పట్టణంలో తెలంగాణ రాష్ట్ర విత్తన-సేంద్రియ ధ్రువీకరణ అథారిటీ సంస్థ కోసం నూతన భవన, గోదాము నిర్మాణ పనులను జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మతో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇక జిల్లాలోని రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించేందుకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. నాణ్యమైన ధ్రువీకరణ చేసిన విత్తనాలు ఉత్పత్తి చేసి రైతులకు సకాలంలో అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. సీడ్ హబ్‌గా సిద్ధిపేట అభివృద్ధి చెందేందుకు ఎన్నో వనరులు, సదుపాయాలు ఉన్నాయని, విత్తనోత్పత్తికి కేంద్రంగా మారిన సిద్ధిపేటలో విత్తన కంపెనీలు, విత్తన రైతులకు ఎంతగానో లబ్ధి చేకూరనున్నదని మంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనేందుకు నిరాకరిస్తున్న నేపథ్యంలో రైతులు మార్కెట్లో డిమాండ్ ఉన్న వాణిజ్య పంటలను సాగు చేయాలని సూచించారు. ఆయిల్ పామ్, సెరి కల్చర్ , పప్పు దినుసులు, పల్లి వంటి డిమాండ్ ఉన్న వాణిజ్య పంటలను రైతులు సాగు చేస్తే మంచి లాభాలు వస్తాయన్నారు. తెలంగాణలో అత్యధిక విస్తీర్ణంలో సెరి కల్చర్ సాగు చేస్తున్న జిల్లా సిద్దిపేట అని మంత్రి తెలిపారు. సిద్దిపేట జిల్లాలో 2 వేల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్నారని తెలిపారు. విత్తనోత్పత్తికి సిద్దిపేట జిల్లా అన్ని విధాలుగా అనుకూలంగా ఉందన్నారు.
పనిలేక కాదు.. 4 కోట్ల ప్రజల భవిష్యత్తు కోసం ఢిల్లీ వచ్చాం
గతంలో దేశాన్ని పాలించిన ప్రభుత్వాలన్నీ వడ్ల కొనుగోలు చేశాయని రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు తెలిపారు . అదే రీతిలో ఇప్పుడు కూడా తెలంగాణలో పండించిన వడ్లు కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విన్నవించేందుకు కేంద్ర మంత్రులను కలిసేందుకు తెలంగాణకు సంబంధించిన మంత్రులు వచ్చారని హరీష్ రావు తెలిపారు. తెలంగాణ మంత్రులు చెప్పే అంశాలను కనీసం వినేందుకు కూడా ఇష్టపడకుండా పనిలేక పదేపదే ఢిల్లీకి వస్తున్నారని కేంద్రం హేళనగా వ్యాఖ్యానించడం సరికాదని మంత్రి తెలిపారు.
ఆహారభద్రత కేంద్రం పరిధిలోని అంశం అన్నారు. అందుకే ఇక్కడి రైతుల ఇబ్బందులను వివరించేందుకు వస్తున్నారని తెలిపారు. ఏం పనిలేకుండా తెలంగాణ మంత్రులు ఢిల్లీకి రాలేదని తెలంగాణ రాష్ట్రంలో నాలుగు కోట్ల మంది ప్రజల భవిష్యత్తును, 70 లక్షల మంది రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే రైతులు పడుతున్న ఇబ్బందులను కేంద్ర ప్రభుత్వానికి వివరించేందుకు మాత్రమే వచ్చారని అన్నారు.
సిద్దిపేట సమీకృత మార్కెట్‌కు తెలంగాణలోనే తొలి ISO సర్టిఫికెట్
తెలంగాణలోనే మొదటిసారిగా సిద్దిపేట సమీకృత మార్కెట్‌కు తొలి ISO సర్టిఫికెట్ రావడం ఆనందంగా ఉందని రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు తెలిపారు. ఇది సిద్దిపేట జిల్లా ప్రజలందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. వ్యవసాయ మార్కెట్ చైర్మన్‌గా గత రెండేళ్లుగా మార్కెట్ అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు. ఆదాయం పెంపొందించే కార్యక్రమాలను చేపట్టి సఫలీకృతం అయ్యారని తెలిపారు. AMC చైర్మన్ పాల సాయిరాంకు ISO సర్టిఫికెట్‌ను రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరుకు హరీష్ రావు అందించి అభినందించారు.
చాలా సంతోషంగా ఉంది: హరీష్ రావు
తెలంగాణలో మొట్టమొదటి సారిగా సిద్దిపేట AMC మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన వర్మి కంపోస్టు షెడ్డును రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. అలాగే మార్కెట్ వ్యర్ధాలను ఉపయోగించి ఈ వర్మి కంపోస్టు షెడ్డు ద్వారా ఎరువును తయారు చేయడం అభినందనీయమన్నారు.
AMC లోని 11 షెడ్‌లకు 8 గోదాంలకు పేర్లు
రైతులు, హమాలీలు, లారీ డ్రైవర్‌ల సౌకర్యార్థం AMC చైర్మన్ పాల సాయిరాం సూచన మేరకు AMC లోని 11 షెడ్‌లకు, 8 గోదాంలకు పేర్లు పెడుతున్నట్లు రాష్ట్ర మంత్రి హరీష్ రావు ప్రకటించారు. జిల్లాలోని ముఖ్య ప్రాంతాల పేర్లను షెడ్‌లకు సూచించేలా నామకరణం చేశామన్నారు. రైతులు, హమాలీలు, లారీ డ్రైవర్‌లు సులువుగా గుర్తించేందుకు వీలుగా ఉంటుందన్నారు.
సిద్దిపేట ప్రాంతంలో పండే వ్యవసాయ పంటలు, వ్యవసాయ వస్తువుల ధరలు, మార్కెటింగ్ ప్రక్రియకు సంబంధించి సిద్దిపేట డిగ్రీ ఎకనామిక్ కోర్సు అభ్యసిస్తున్న విద్యార్థులు క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేయనున్నారు. మార్కెట్ యార్డు, మార్కెటింగ్ విధానాన్ని పరిశీలించడం ద్వారా శిక్షణ , విజ్ఞానం, ఉపాధి నైపుణ్యాన్ని విద్యార్థులు సొంతం చేసుకోగలుగుతారు. రైతులు తమ పంటలకు అధిక గిట్టుబాటు ధర పొందేందుకు విద్యార్థులు సూచనలు చేయనున్నారు. క్షేత్ర అధ్యయన ఫలితాలను AMC, ప్రభుత్వానికి పంపించనున్నారు.
రాష్ట్ర మంత్రి హరీష్ రావు, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ CH ప్రసాద్ ల సమక్షంలో ఆర్థిక శాస్త్ర డిపార్ట్మెంట్ హెడ్ డా.కే భవాని, AMC చైర్మన్ పాల సాయిరాంలు అవగాహన ఒప్పందం పై సంతకాలు చేశారు. అంతకుముందు మంత్రి హరీష్ రావు సిద్ధిపేట సమీకృత మార్కెట్ సమీపంలో విత్తన-సేంద్రియ ధ్రువీకరణ నూతన భవన, గోదాము నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. సమీకృత మార్కెట్ ఫిష్ బ్లాకులో డిమాండ్ కు అనుగుణంగా రూ.3 లక్షలతో అదనపు ఫిష్ స్టాల్స్ ప్రారంభించారు.