‘అందులో పోటీ పడి.. కేసీఆర్ గౌరవాన్ని నిలబెట్టాలి’

by  |
‘అందులో పోటీ పడి.. కేసీఆర్ గౌరవాన్ని నిలబెట్టాలి’
X

దిశ, గజ్వేల్: సీఏం కేసీఆర్ గౌరవాన్ని నిలబెట్టేలా.. అన్ని మండలాలు అభివృద్ధిలో పోటీ పడాలని నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, అధికారులకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు సూచించారు. సిద్ధిపేట జిల్లా గజ్వేల్ ఐఓసీ కార్యాలయంలో బుధవారం గడ ప్రత్యేక అధికారి ముత్యంరెడ్డి అధ్యక్షతన వివిధ శాఖలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో పాల్గొన్న మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ప్రతీ మండలం.. మరో మండలంతో అభివృద్ధిలో పోటీ పడి అగ్రభాగాన నిలవాలని, ఆ దిశగా ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయాలని మంత్రి కోరారు. జూలై 31వ తేదీలోపు డంప్, గ్రేవ్ యార్డులు, ఆగస్టు 10వ తేదీలోపు రైతు వేదిక నిర్మాణాలు పూర్తి చేయాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. హరితహారంలో ఇప్పటికే గజ్వేల్ నియోజకవర్గం ఆదర్శంగా నిలిచింది. అన్ని గ్రామాల్లో రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటాలని, రోడ్డుకు చుట్టుపక్కల మొక్కలు లేకుండా ఖాళీ స్థలం ఉండొద్దని అధికారులకు మంత్రి సూచించారు. ఈ సమీక్షలో వివిధ శాఖా అధికారుతో సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం పలు సూచనలు చేశారు. ఈ సమీక్షలో జెడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, ఎఫ్డీసీ చైర్మెన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, డీసీసీబీ చైర్మెన్ చిట్టి దేవేందర్ రెడ్డి, జిల్లా అడిషనల్ కలెక్టర్ ముజమ్మీల్ ఖాన్, ఆర్డీఓ విజయేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed