కోవిడ్ టెస్ట్‌ల సంఖ్య మరింత పెంచాలి

by  |
కోవిడ్ టెస్ట్‌ల సంఖ్య మరింత పెంచాలి
X

దిశ ప్రతినిధి, మెదక్: కోవిడ్ గురించి ప్రజలు ఆందోళన చెందొద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి హరీశ్ రావు అన్నారు. కరోనా కట్టడికి అమలుచేయాల్సిన వ్యూహం, ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయంపై హైదరాబాద్ నుంచి మంత్రి హరీశ్ రావు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ..

కోవిడ్ టెస్ట్‌ల సంఖ్య మరింత పెంచాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు జనాలు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో తిరగకుండా ఉండాలని తెలిపారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్ళొద్దని సూచించారు. బయటకు వెళ్ళే సందర్భంలో ప్రతిఒక్కరూ తప్పక మాస్క్ ధరించాలన్నారు. మాస్క్ లేకుండా బయటికి వస్తే రూ.500 ఫైన్ విధించాలని అధికారులను ఆదేశించారు. వ్యాధి లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలన్నారు. సానిటేషన్, స్ప్రే కార్యక్రమాలు నిరంతరం జరిగేలా చూడాలన్నారు.


Next Story

Most Viewed