- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వారికి త్వరలో పెండింగ్ జీతాలు.. మంత్రి హరీష్ రావు గుడ్ న్యూస్
దిశ, తెలంగాణ బ్యూరో: గచ్చిబౌలిలోని టిమ్స్‌తో పాటు కింగ్ కోఠి హాస్పిటల్స్‌లో సాధారణ వైద్య సేవలను తిరిగి ప్రారంభించేందుకు సర్కార్ ఏర్పాట్లు చేస్తున్నది. కరోనా తీవ్రత తగ్గడంతో 350 పడకలు ఉన్న కింగ్ కోఠి జిల్లా దవాఖానలో అన్ని రకాల వైద్యసేవలు అందించాలని వైద్యాధికారులకు ఆదేశాలిచ్చింది. కరోనా నోడల్ సెంటర్ గా ఉన్న టిమ్స్ లోనూ కేవలం 200 పడకలు మినహాయించి మిగతా బెడ్లన్నీ సాధారణ వైద్యసేవలకు కేటాయించాలని సర్కార్ సూచించింది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు గురువారం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… టిమ్స్ ఆసుపత్రి బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. దీంతో పాటు పెండింగ్ లో ఉన్న సిబ్బంది జీతాలను అందిస్తామన్నారు.
మెడికల్ కాలేజీల్లో స్పీడ్ పెంచాలి
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలబెట్టిన 8 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని మంత్రి హరీష్‌రావు సూచించారు. నేషనల్ మెడికల్ కమిషన్ తనిఖీలు చేసేలోపు పనులను పూర్తి చేయాలన్నారు. మౌలిక వసతులు, మ్యాన్ పవర్ ను సమకూర్చాలన్నారు. అంతేగాక కొత్త మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులతో పాటు వరంగల్‌లోని మల్టీ సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రి నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలన్నారు. ఇబ్బందులు ఉంటే ప్రభుత్వానికి తెలియజేయాలని మంత్రి హరీష్ కోరారు.
వ్యాక్సినేషన్లో వేగం
రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సినేషన్ లో వేగం పెంచాలని మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. ఇప్పటికే జాతీయ సగటును మించి వ్యాక్సినేషన్ ను నిర్వహించినప్పటికీ వైరస్ వ్యాప్తి నియంత్రించేందుకు మరింత స్పీడప్ చేయాలన్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 84.3 శాతం మందికి మొదటి డోస్ పూర్తి కాగా.. 38.5 శాతం మందికి రెండో డోస్ పూర్తి చేసినట్లు వెల్లడించారు. వ్యాక్సినేషన్ లో వేగం పెంచేందుకు శనివారం అన్ని జిల్లాల వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అంతకుముందు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుక్ మాండవీయ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి హరీష్‌రావు పాల్గొన్నారు. కరోనా కేసులు, వ్యాక్సినేషన్ కార్యక్రమాల పరిస్థితిని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, సీఎం ఓఎస్డీ డా.గంగాధర్, డీఎంఈ డా.రమేష్‌రెడ్డి, కాళోజీ వర్సిటీ వీసీ కరుణాకర్ రెడ్డిలు పాల్గొన్నారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని అడ్డంగా బుక్ చేసిన హరీష్ రావు