ఉద్యమమే ఊపిరిగా పనిచేసిన వ్యక్తి ఆయన: హరీష్ రావు

by Shyam |   ( Updated:2021-08-24 07:56:48.0  )
ఉద్యమమే ఊపిరిగా పనిచేసిన వ్యక్తి ఆయన: హరీష్ రావు
X

దిశ, దుబ్బాక : ఉద్యమమే ఊపిరిగా పని చేసిన వ్యక్తి సోలిపేట రామలింగారెడ్డి అని మంత్రి హరీష్ రావు అన్నారు. రామలింగారెడ్డి లేకపోవచ్చు కానీ ఆయన చూపిన ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు నడుస్తున్నామని మంత్రి చెప్పుకొచ్చారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామంలో మంగళవారం దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ప్రముఖ రచయిత నందిని సిద్దారెడ్డి, కవి దేశపతి శ్రీనివాస్ తో కలిసి సోలిపేట రామలింగారెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సంస్మరణ సభలో ఆయన మాట్లాడారు. రామలింగారెడ్డి లేకుండా చిట్టాపూర్‌లో సభలు జరుపుకుంటామని కలలో కూడా అనుకోలేదని అన్నారు. కేసీఆర్ చేసిన ఆమరణ నిరాహార దీక్షలో గడ్డకట్టెంత చలిలో కూడా రామలింగారెడ్డి ముందుండి పోరాటం చేశారని గుర్తు చేశారు. కేసీఆర్ అడుగుజాడలో నడిచిన వ్యక్తిగా రామలింగారెడ్డికి పేరుందని చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story