కాంట్రాక్టు లెక్చరర్లకు మంత్రి హరీశ్ రావు గుడ్‌న్యూస్..

by Shyam |   ( Updated:2021-07-04 07:51:11.0  )
కాంట్రాక్టు లెక్చరర్లకు మంత్రి హరీశ్ రావు గుడ్‌న్యూస్..
X

దిశ, వెబ్‌డెస్క్ : కాంట్రాక్టు లెక్చరర్లకు ఆర్థిక మంత్రి హరీశ్ రావు గుడ్ న్యూస్ చెప్పారు. సిద్ధిపేట కేంద్రంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. త్వరలోనే కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులరైజ్ చేస్తామన్నారు. ఇప్పటికే వారికి బేసిక్ పే ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించామని మంత్రి గుర్తుచేశారు. గత ప్రభుత్వాలు కళాశాలలు మంజూరు చేసి పోస్టులను మరిచాయని విమర్శించారు.

కరోనాతో మృతి చెందిన కాంట్రాక్టు లెక్చరర్లకు సాయం అందిస్తామన్నారు. కాగా, కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ పుణ్యమా అని పాఠశాలలు, కళాశాలలు మూతపడటంతో వేతనాలు లేక కాంట్రాక్టు లెక్చరర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కరోనా రెండో దశ సమయంలో వేతనాలు రాక కుటుంబాన్ని పోషించుకోలేక కొందరు కాంట్రాక్టు లెక్చరర్లు బలవంతంగా ప్రాణాలు తీసుకోవడం అందరినీ కలచివేసింది.

Advertisement

Next Story

Most Viewed