- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హైదరాబాద్‌లో పెట్టుబడులపై హరీశ్ రావు క్లారిటీ
దిశ, తెలంగాణ బ్యూరో : మౌలిక సదుపాయాలు, నాణ్యమైన విద్యుత్, రహదారులు, ఎయిర్ పోర్టు, శాంతిభద్రతల విషయంలో తెలంగాణ ప్రాంతం, హైదరాబాద్ నగరం పెట్టుబడులకు స్వర్గధామం అని ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. సోమవారం అరణ్యభవన్‌లో సింగపూర్ హైకమిషనర్ హెచ్ఈ సైమన్ వాంగ్ తన ప్రతినిధుల బృందంతో మంత్రిని కలిశారు. హైదరాబాద్ నగరం, తెలంగాణ రాష్ట్ర స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో సీఎం కేసీఆర్ నేతృత్వంలో ముందుకెళ్తోందన్నారు. డెటా సెంటర్లకు హైదరాబాద్ అత్యంత అనువైనదని, ఇప్పటికే అమెజాన్ వంటి సంస్థలు తమ కార్యాలయాలు ఇక్కడ ఏర్పాటు చేశాయన్నారు. భౌగోళికంగా హైదరాబాద్ సురక్షితమైన నగరమని, రాష్ట్ర ప్రభుత్వం అన్ని సౌకర్యాలతో ఫార్మా సిటినీ ఏర్పాటు చేస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్రం వ్యాక్సిన్ హబ్‌గా మారిందని, సోలార్ వంటి రంగాల్లో పెట్టుబడులకు అనువైందని, ఏడాది పొడవునా సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చన్నారు.