కేంద్ర ప్రభుత్వం పై హరీశ్ రావు ఫైర్

by  |
కేంద్ర ప్రభుత్వం పై హరీశ్ రావు ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: జీఎస్టీ పరిహారం పూర్తి స్థాయిలో కేంద్రం చెల్లించాల్సిందే అంటూ తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. జీఎస్టీ పై ఢిల్లీ వేదికగా జరిగిన సమావేశానికి.. హరీశ్ రావు హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు.

కరోనా పేరుతో రూ. లక్షా 35 వేల కోట్లు ఎగ్గొట్టాలని కేంద్రం చూస్తోందన్నారు. గత నాలుగు నెలల్లో తెలంగాణ రూ. 8 వేల కోట్ల ఆదాయం కోల్పోయింది అని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాలకు హక్కుగా రావాల్సిన సెస్సును ఎగ్గొట్టేందుకు చూస్తున్నారని మండిపడ్డారు. జీఎస్టీలో చేరకుంటే రూ. 25 వేల కోట్లు రాష్ట్రానికి అదనంగా వచ్చేవని.. దేశ ప్రయోజనాల కోసం జీఎస్టీలో చేరామని ఆయన గుర్తు చేశారు. అయినప్పటికీ.. కరోనా పేరుతో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరికాదని హరీశ్ రావు అభిప్రాయపడ్డారు.



Next Story