బొమ్మల తయారీ బోర్డు' ఏర్పాటు చేయాలి….

by srinivas |
బొమ్మల తయారీ బోర్డు ఏర్పాటు చేయాలి….
X

దిశ, వెబ్ డెస్క్:
‘ఏపీ బొమ్మల తయారీ బోర్డు’ను ఏర్పాటు చేయాలని అధికారులను మంత్రి గౌతమ్‌ రెడ్డి ఆదేశించారు. పరిశ్రమల శాఖ అధికారులతో ఆయన సమీక్ష సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈడీబీ, పరిశ్రమలకు సంబంధించి నీటి అవసరాలు, ఎస్ఐపీసీ, ఎస్ఐపీబీపై అధికారులతో ఆయన చర్చించారు. పరిశ్రమల శాఖకు సంబంధించి గ్రీవెన్స్ స్వీకరించేలా రూపకల్పన చేసిన ప్రత్యేక వెబ్ సైట్ ‘స్పందన’ను ఆయన ప్రారంభించారు. నవంబర్ నెలలో ‘పరిశ్రమల స్పందన’ కార్యకమ్రాన్ని ప్రారంభిస్తామని ఆయన చెప్పారు.

Next Story

Most Viewed