ఈటలకు మంత్రి గంగుల స్ట్రాంగ్ కౌంటర్.. నువ్వు ఒక్కటంటే.. నేను రెండంట.. తట్టుకోలేవ్

by Anukaran |   ( Updated:2021-05-18 01:42:13.0  )
ఈటలకు మంత్రి గంగుల స్ట్రాంగ్ కౌంటర్.. నువ్వు ఒక్కటంటే.. నేను రెండంట.. తట్టుకోలేవ్
X

దిశ, వెబ్ డెస్క్: టీఆర్ఎస్ నేత ఈటల రాజేందర్ పై మంత్రి గంగుల కమలాకర్ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఈరోజు ఉదయం ఈటల చేసిన వ్యాఖ్యలకు కమలాకర్ స్పందిస్తూ ఈటల తప్పుచేసినట్లు డాక్యుమెంటరీ ఆధారాలు ఉన్నాయని, అన్ని పరిశీలించిన తర్వాతే కేసీఆర్ ఈటలను బర్తరఫ్ చేశారని అన్నారు. ప్రజాప్రతినిధులను బ్లాక్ మెయిల్ చేస్తున్నారన్న ఈటల మాటలకు అసైన్డ్ భూములను కొన్నట్లు ఈటల స్వయంగా ఒప్పుకున్నారని, నిజంగా ఆయనకు ఆత్మగౌరవం ఉంటే రాజీనామా చేయాలనీ గంగుల తెలిపారు. ఈటలకు దమ్ముంటే ప్రజాక్షేత్రంలోకి రావాలని అన్నారు. హుజారాబాద్ లో ఇప్పటికి క్వారీలు నడుస్తున్నాయని, మరి క్వారీలపై ఇంకా సీఎం కేసీఆర్ కి ఎందుకు ఫిర్యాదు చేయలేదని ఆయన ప్రశ్నించారు. ఈటల బెదిరిస్తే ఇక్కడ భయపడేవారు ఎవరు లేరని, ఇప్పటివరకు ఆయన కేసీఆర్ పార్టీలో ఉన్నారు కాబట్టే గౌరవం ఇచ్చామని తెలిపారు. బిడ్డా.. బిడ్డా అని బెదిరిస్తే అంతకంటే ఎక్కువ మాట్లాడతానని, తానూ బీసీ బిడ్డనేనంటూ గంగుల వార్నింగ్ ఇచ్చారు.



Next Story