'నిమ్స్'లో మాలిక్యులర్ లాబ్

by  |
Minister Etela Rajender
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజారోగ్య రంగంపై దృష్టి పెట్టిన ప్రభుత్వం ఒక్కో కొత్త చర్యకు శ్రీకారం చుడుతోంది. కరోనా టెస్టుల సంఖ్యను పెంచడంతోపాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయి వరకూ అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు నగరంలోని నిమ్స్ ఆసుపత్రిలో తక్కువ సమయంలో ఎక్కువ నిర్ధారణ పరీక్షలు చేసేందుకు వీలుగా ఆరు కోట్ల రూపాయల ఖర్చుతో మాలిక్యులర్ లాబ్‌ను నెలకొల్పింది. దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా వేగంగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేసేందుకు ఉపయోగించే కోబస్ మెషీన్‌ను సమకూర్చింది. మంత్రి ఈటల రాజేందర్ ఈ సౌకర్యాలన్నింటినీ శుక్రవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావాలన్న నిర్ణయంలో భాగంగా ఇప్పుడు నిమ్స్‌ ఆసుపత్రిలో మాలిక్యులర్‌ లాబ్‌ను నెలకొల్పామని, దీని కారణంగా మూత్రపిండాలు, కాలేయం (లివర్), గుండె, మూల్గ (బోన్ మ్యారో) తదితర అవయవాల మార్పిడికి ముందు రోజులకు చేయాల్సిన పరీక్షలకు వీలు కలుగుతుందన్నారు. ఒకేసారి హెచ్‌ఐవీ, టీబీ, కరోనా తదితర పలు వ్యాధులకు సంబంధించిన నిర్ధారణ పరీక్షలు చేసే వీలు కలుగుతుందని, తక్కువ సమయంలోనే వీటన్నింటినీ చేయవచ్చునన్నారు. కోబస్ మిషన్ ద్వారా ఒక్క రోజులో నాలుగు వేల కరోనా నిర్ధారణ పరీక్షలు కూడా చేయవచ్చునని వివరించారు.


Next Story

Most Viewed