- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆ మంత్రి లక్ష్యం నెరవేరిందా..?
దిశ ప్రతినిధి, కరీంనగర్: మంత్రి ఈటల రాజేందర్ ఇటీవల తన నియోజకవర్గంలో పర్యటించిన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు కలకలం లేపిన సంగతి తెలిసిందే. అటు సొంత పార్టీలో ఇటు ప్రతిపక్ష పార్టీలో విస్తృతంగా చర్చ జరిగింది. అయితే మంత్రి ఈటల నియోజకవర్గం నుండి హైదరాబాద్ వెళ్లిన తరువాత ఈ అంశాలన్నీ చల్లబడిపోయాయి. దాదాపు ఐదు రోజుల పాటు నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి రైతుబంధు, ధరణీ లోపాల గురించి వ్యాఖ్యానించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయం హాట్ టాపిక్‌గా మారిపోయిన సంగతి తెలిసిందే. అసలెందుకు ఆయన మాట్లాడారు. కారణాలు ఏంటీ అన్న విషయంపై తర్జనభర్జనలు సాగాయి. ప్రభుత్వంలో ఉంటూ సర్కారు తప్పిదాలను ఎత్తి చూపుతూ బహిరంగంగా మాట్లాడాల్సిన అవసరం లేదని టీఆర్ఎస్ ముఖ్య నాయకులు వ్యాఖ్యానించిన పరిస్థితి నెలకొంది. ఇదే సమయంలో కరీంనగర్ జిల్లాలో పర్యటించిన మరో మంత్రి కూడా ఈటల వ్యాఖ్యలపై అసహనానికి గురయ్యారన్న ప్రచారం కూడా జరిగింది.
డబుల్ బొనాంజా?
మంత్రి ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యల వెనుక అసలు కారణాలు వేరే ఉన్నాయన్న వాదనలు కూడా తెరపైకి వచ్చాయి. గుడార్థం దాగి ఉందని, అందుకే ఆయన అలాంటి సంకేతాలు పంపించారని అంటున్న వారు లేకపోలేదు. సీఎంగా కేటీఆర్ బాధ్యతలు తీసుకుంటే కేబినెట్‌లో మార్పులు చేర్పులు ఉంటాయన్న కారణంగానే ఆయన అలా మాట్లాడి ఉంటారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే సమయంలో రైతుల గురించి మాట్లాడడం వల్ల రైతాంగం కూడా అక్కున చేర్చుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. సొంత నియోజకవర్గం నుండే ఘాటుగా స్పందిస్తే అటు అధినాయకత్వానికి సంకేతాలు పంపించడంతో పాటు తాను చేసిన వ్యాఖ్యల గురించి పల్లెపల్లెన చర్చ జరుగుతుందని తెలుస్తోంది. దీంతో తాను రైతు పక్ష పాతినన్న విషయం నియోజకవర్గంలోని ప్రజల్లో బలంగా నాటుకపోతుందనే ఇలా మాట్లాడి ఉంటారని హజురాబాద్‌కు చెందిన నాయకుడు ఒకరు కామెంట్ చేశారు. రెండు విధాలా లాభం చేకూరుతుందనే ఎప్పుడూ నియోజకవర్గాన్నే కేంద్రంగా చేసుకుని అస్త్రాలు సంధిస్తారని అంటున్నారు విశ్లేషకులు.
వైరి మంత్రి దగ్గరయ్యాడనా.?
ఉత్తర తెలంగాణ జిల్లాకు చెందిన ఓ మంత్రితో ఉన్న వైరుద్యం కూడా మంత్రి వ్యాఖ్యలకు కారణమంటున్నారు మరి కొందరు. వ్యక్తిగతంగా వీరిద్దరి మధ్య అభిప్రాయ బేధాలు ఉన్నాయి. ఈ విషయం గురించి బాహాటంగానే పార్టీలో కూడా చర్చ సాగుతూ ఉంటుంది. అయితే ఈటలకు వ్యతిరేకంగా ఉన్న సదరు మంత్రి ఇటీవల కేసీఆర్ ఫ్యామిలీకి దూరం అయినట్లే అయి మళ్లీ దగ్గర కావడం కూడా ఆయన అసహనానికి కారణం అయి ఉంటుందా అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.