- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దేవాదుల పనులన్నీ త్వరగా పూర్తి చేయాలి
దిశ, తెలంగాణ బ్యూరో: దేవాదుల ప్రాజెక్టులో మిగిలి ఉన్న పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధికారులను ఆదేశించారు. దేవాదుల ప్రాజెక్టు పురోగతిలో ఉన్న పనులపై హైదరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం ప్రాజెక్టు సంబంధిత ఉన్నతాధికారులతో ఆయా కాలువల పనుల వారీగా సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పనుల్లో నాణ్యత విషయంలో రాజీ పడొద్దని, అయా పనుల్లో భూ సేకరణ జరగని ప్రదేశాల్లో సేకరణ తక్షణమే చేపట్టాలని, సమస్య ఉంటే సత్వరమే పరిష్కరించాలన్నారు. పూర్తి కాని పనులకు వెంటనే టెండర్లను ఖరారు చేయాలని, ఆయా పనులను నిర్ణీత సమయానికి పూర్తయ్యేలా అధికారులు పర్యవేక్షించాలని మంత్రి దయాకర్‌రావు ఆదేశించారు. ఈ నెల 19న నిర్వహించే సమీక్ష సమావేశానికి అధికారులు దేవాదుల ప్రాజెక్టు అభివృద్ధి పనులపై సమగ్ర సమాచార నివేదికలను తీసుకొని రావాలని, ఈ సమావేశానికి నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి రజత్ కుమార్, సీఎం కార్యదర్శి, ఓఎస్డీ స్మితా సభర్వాల్ తదితర ఉన్నతాధికారులు హాజరవుతారని మంత్రి తెలిపారు. ఈ సమీక్షలో వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్, ప్రాజెక్ట్ సంబంధిత ఎస్ఈ, సీఈలు, ఇతర ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.