రైతుల‌కు ఇబ్బందులు రాకుండా చూడాలి : మంత్రి ఎర్రబెల్లి

by Shyam |
రైతుల‌కు ఇబ్బందులు రాకుండా చూడాలి : మంత్రి ఎర్రబెల్లి
X

దిశ, వరంగల్: రైతుల‌కు ఇబ్బందులు రాకుండా చూసే బాధ్య‌త ప్ర‌జాప్ర‌తినిధుల‌దేనని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశించారు. మ‌హ‌బూబాబాద్ జిల్లా, పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని పెద్ద‌వంగ‌ర‌‌లో మంత్రి ధాన్యం, మక్క‌జొన్న‌ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు స‌మ‌న్వ‌య స‌మితి స‌భ్యులు, స‌ర్పంచ్, ఎంపీటీసీ, గ్రామ కార్య‌ద‌ర్శి, సొసైటీ డైరెక్ట‌ర్, మార్కెట్ క‌మిటీ డైరెక్ట‌ర్, వీఆర్ఓ, వ్య‌వ‌సాయ‌శాఖ అధికారుల‌తో క‌లిసి గ్రామ స్థాయిలో ఓ క‌మిటీ వేసుకోవాలని సూచించారు.ఈ క‌మిటీ స‌భ్యులంతా క‌లిసి, ధాన్యం కొనుగోలు చేస్తున్న ఐకేపీ సంస్థ‌కు స‌హ‌క‌రించాలన్నారు. ధాన్యం మొత్తం ఎండిన త‌ర్వాతే రైతులు కూప‌న్ ప్ర‌కారం, నిర్ణీత తేదీనాడే మార్కెట్‌కు తీసుకురావాలన్నారు. లాట‌రీ ప‌ద్ధ‌తి ద్వారా ఏ రైతు ఎప్పుడు తేవాల‌నేది నిర్ణ‌యించాలన్నారు. రైతుల‌తో స్వయంగా మాట్లాడి దిగుబ‌డులు తెలుసుకుని, వారి పంట‌ల‌ను మొత్తం ప్ర‌భుత్వ‌మే కొనుగోలు చేస్తుంద‌ని మంత్రి భ‌రోసా ఇచ్చారు.కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మహిళలకు మాస్కుల పంపిణీ చేశారు. కరోనా మూలంగా నిరంత‌రం ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు. మంత్రి ప‌ర్వ‌త‌గిరి నుంచి తొర్రూరులో పర్యటించారు. దారిలో ఓ ఇద్ద‌రు మ‌హిళ‌లు పొలం ప‌నుల‌కు వెళుతున్నారు. వాళ్ళ‌ని చూసిన మంత్రి వెంట‌నే కారు ఆపారు. కారు ఆగ‌డంతో ఆ మ‌హిళ‌లు నేరుగా మంత్రిగారి ద‌గ్గ‌ర‌కు వ‌చ్చారు. క‌రోనా స్థితిగ‌తులు, వాళ్ళు తీసుకుంటున్న జాగ్ర‌త్త‌లు అడిగి తెలుసుకున్నారు. మ‌రి ముఖాల‌కు మాస్కులు లేదా బ‌ట్ట‌లైనా క‌ట్టుకోవాలి క‌దా? అని ప్ర‌శ్నించారు. ఆ వెంట‌నే త‌న వ‌ద్ద ఉన్న మాస్కులు తీసి వాళ్ళ‌కు ఇచ్చారు. ‘మీరు ఆరోగ్యంగా ఉండండి… మీ చుట్టూ ఉన్న వాళ్ళ‌ని ఆరోగ్యంగా ఉండేలా చూడండి అని చెప్పారు. ఇదే విష‌యాన్ని మిగ‌తా వాళ్ళ‌కి చెప్పండంటూ మంత్రి అక్క‌డి నుంచి క‌దిలారు.

Tags: Minister Errabelli Dayakar Rao, opened, grain buying center, warangal



Next Story