మ‌ట్టి గ‌ణ‌ప‌తుల‌ను పూజించండి.. మంత్రి ఎర్రబెల్లి పిలుపు

by Shyam |   ( Updated:2021-09-10 04:44:54.0  )
Minister Errabelli Dayakar Rao
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్: వినాయ‌కుడి భ‌క్తులంతా మ‌ట్టి గ‌ణ‌పతుల‌ను ప్రతిష్టించి పూజించాల‌ని మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్‌ రావు పిలుపునిచ్చారు. అలాగే, గణపతి మండపాల వద్ద కరోనా నిబంధనలు పాటించాలని కోరారు. శుక్రవారం హన్మకొండ పట్టణంలోని వేయి స్తంభాల గుడిలో నిర్వహించిన గణపతి ఉత్సవాలను మంత్రి ద‌యాక‌ర్‌రావు, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విన‌య్‌ భాస్కర్ ప్రారంభించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి నుంచి ప్రపంచాన్ని కాపాడాలని, తెలంగాణ ప్రజలు సుఖ, సంతోషాలతో ఆనందంగా ఉండాలని గ‌ణ‌ప‌తిని కోరుకున్నట్లు తెలిపారు. అందరూ ఇంట్లోనే మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాల‌ని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితోనే రామప్ప ఆలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించింద‌ని అన్నారు. వేయి స్తంభాల గుడిని ఆధ్యాత్మికంగా వెలుగొందే విధంగా అభివృద్ధి చేస్తున్నామ‌న్నారు. సీఎం కేసీఆర్ ఆలోచనలతో రాష్ట్రం బంగారు తెలంగాణగా మారుతోంద‌న్నారు.

Advertisement

Next Story

Most Viewed