ఇబ్బందులున్నా.. విద్యార్థులు ఆగం కావొద్దు

by Shyam |
ఇబ్బందులున్నా.. విద్యార్థులు ఆగం కావొద్దు
X

దిశ, వర్ధన్నపేట:
క‌రోనా క‌ష్ట కాలంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్న‌ప్ప‌టికీ, విద్యార్థుల భ‌విష్య‌త్తు ఆగం కాకుండా ఉండ‌డానికే ప్ర‌భుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా పుస్త‌కాలు అందిస్తున్న‌ట్టు మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. బుధవారం వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లాలోని త‌న సొంత గ్రామం ప‌ర్వ‌త‌గిరిలో మంత్రి ఎర్ర‌బెల్లి వ‌ర్ద‌న్న‌పేట ఎమ్మెల్యే అరూరి ర‌మేశ్‌తో క‌లిసి విద్యార్థుల‌కు పుస్తకాలు పంపిణీ చేసారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్ర‌భుత్వం ఈ విద్యా సంవ‌త్స‌రం వృథా కాకుండా ఉండ‌డానికి వీలుగా అన్ని చ‌ర్య‌లు చేప‌డుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 29790 స్కూల్స్ లో 26,37,257 మంది విద్యార్థుల‌కు కోటి, 50ల‌క్ష‌ల 92వేల 454 పాఠ్య పుస్త‌కాలను పంపిణీ చేస్తున్నామ‌న్నారు. ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా వ్యాప్తంగా 3,917 స్కూల్స్ లో 2,68,311 మంది విద్యార్థుల‌కు 15,17,591 పాఠ్య‌ పుస్త‌కాలు పంపిణీ చేస్తున్న‌ట్టు మంత్రి ఎర్ర‌బెల్లి తెలిపారు.

Advertisement

Next Story